పాక్ జైల్లో బాగా కొట్టారు… కానీ…

ప్రేమించిన అమ్మాయి కోసం తెలుగు యువ‌కుడు దేశాలు దాటి వెళ్లేందుకు కాలి న‌డ‌క‌న బ‌య‌లుదేరి దాయాది దేశం సైనికుల‌కు దొరికిపోయాడు.  2017 నుంచి పాక్ చెర‌లో ఉన్న తెలుగు యువ‌కుడు ప్ర‌శాంత్ ఇటీవ‌ల రిలీజ్ అయ్యి హైద‌రాబాద్ చేరుకున్నాడు.  పాక్ చెర నుంచి క్షేమంగా బ‌య‌ట‌ప‌డిన ప్ర‌శాంత్ పాక్ జైలు గురించి కీల‌క విష‌యాల‌ను తెలియ‌జేశాడు.  విచార‌ణ స‌మ‌యంలో త‌న‌ను తీవ్రంగా కొట్టార‌ని,  ఏడారి ప్రాంతంలో సైనికుల‌కు దొరికిన స‌మ‌యంలో త‌న‌కు మంచి ఆహారం అందించార‌ని ప్ర‌శాంత్ పేర్కోన్నారు.  రెండేళ్లు త‌న‌కు న‌క‌రం క‌నిపించింద‌ని, రెండ‌ళ్ల త‌రువాత ప‌రిస్థితి కొంత మార్పు వ‌చ్చిన‌ట్టు ప్ర‌శాంత్ తెలిపారు.  త‌న‌లాగా చాలా మంది భార‌తీయులు పాక్ జైల్లో న‌ర‌కం అనుభ‌విస్తున్నార‌ని, ప్ర‌భుత్వాలు వారిని విడుద‌ల చేసే విధంగా చొర‌వ చూపాల‌ని ప్ర‌శాంత్ తెలిపారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-