‘మా’ లో మరో మలుపు.. పేపర్ బ్యాలెట్ Vs ఈవీఎం

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు మరో మలుపు తిరిగాయి. అక్టోబర్ 10న జరిగే మా ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహించాలని మంచు విష్ణు కోరారు. ఈమేరకు మా ఎన్నికల అధికారికి మంచు విష్ణు లేఖ రాశారు.

‘ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని, ఈవీఎంలపై మా ప్యానెల్ సభ్యులకు నమ్మకం లేదని మంచు విష్ణు పేర్కొన్నారు. పేపర్ బ్యాలెట్ విధానంలోనే ఈసారి మా పోలింగ్ నిర్వహించాలి. పేపర్ బ్యాలెట్ విధానంలో జరిగే పోలింగ్ లో పారదర్శకత ఉంటుంది. ఈవీఎంల కంటే పేపర్ బ్యాలెట్ చాలా ఉత్తమమైనది. పేపర్ బ్యాలెట్ కల్పిస్తే సీనియర్లు చాలా మంది ఓటు వేసే అవకాశం ఉంటుంది’ అని మంచు విష్ణు లేఖలో తెలిపారు.

మరోవైపు ప్రకాష్ రాజ్ ప్యానెల్ నేడు మంచు విష్ణు ప్యానెల్ పై ఫిర్యాదు చేసింది. 60 మందితో పోస్టల్ బ్యాలెట్ లో తమకు అనుకూలంగా మంచు విష్ణు ఓటు వేయించుకుంటున్నారని ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఎన్నికల సహాయ అధికారి నారాయణరావుకు శ్రీకాంత్, జీవితరాజశేఖర్ తో వచ్చి ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారు. ఈ నెల 10న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మరెన్ని మలుపు తిరుగుతాయో చూడాలి.

-Advertisement-‘మా’ లో మరో మలుపు.. పేపర్ బ్యాలెట్ Vs ఈవీఎం

Related Articles

Latest Articles