మనస్సాక్షిగా ఓటేద్దాం.. ‘మా’ ఆశయాలను గెలిపిద్దాం: ప్రకాష్ రాజ్

టాలీవుడ్ సినీ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్న అంశం ‘మా’ ఎలక్షన్స్.. అక్టోబర్ 10న ఎన్నికలు జరగనుండగా.. గత రెండు నెలల నుంచే ‘మా’ వేడి మొదలైయింది. పోటీలో అభ్యర్థులంతా నామినేషన్లు వేశారు. ఎన్నికల ప్రచారం కూడా మొదలు పెట్టారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ కు, మంచు విష్ణు ప్యానల్ కు మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఇక నటుడు నరేష్ మాట్లాడుతూ.. మంచు విష్ణుకు పూర్తి మద్దతు పలికిన సంగతి తెలిసిందే.

అయితే, తాజాగా నటుడు ప్రకాష్ రాజ్ ‘మా’ ఎన్నికలపై ఓటర్లను ఉద్దేశిస్తూ.. ‘”మా” హితమే
మా అభిమతం… మనస్సాక్షిగా ఓటేద్దాం.. “మా” ఆశయాలను గెలిపిద్దాం..’ మీ ఓటే.. మీ వాయిస్.. అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ఇక మొదటి నుంచి ‘మా’ ఎన్నికలపై ఉత్సహంగా వున్నా ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులతో కలిసి నామినేషన్ వేశారు. ఇవి ఎన్నికలు కావు. పోటీ మాత్రమేనన్న ప్రకాష్ రాజ్.. ఇక్కడ గెలుపోటములు నిర్ణయించేది ఓటర్లే అన్నారు. అక్టోబర్ 3న తన మేనిఫేస్టో ప్రకటిస్తానన్నారు.

-Advertisement-మనస్సాక్షిగా ఓటేద్దాం.. ‘మా’ ఆశయాలను గెలిపిద్దాం: ప్రకాష్ రాజ్

Related Articles

Latest Articles