ఎలక్షన్స్ ఎప్పుడని అడుగుతున్న ప్రకాశ్ రాజ్!

జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్ రాజ్ కు ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడటం అలవాటు. అందుకే కేంద్రంపై ధ్వజం ఎత్తాలన్నా… జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ తో అడిగేస్తుంటాడు, కడిగేస్తుంటాడు! తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి పోటీ చేయాలని అనుకున్న ప్రకాశ్ రాజ్ ఇవాళ ట్విట్టర్ లో ‘ఎలక్షన్స్ ఎప్పుడు?’ అంటూ ఓ ప్రశ్న సంధించాడు. ఆయన అడిగేది ‘మా’ ఎన్నికల గురించి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Read Also: ప్రభాస్ మూవీ షూటింగ్ లో… మహేశ్ బ్యూటీ!

అయితే… దీనికి సమాధానం చెప్పాల్సిన వారు మాత్రం పెదవి విప్పడం లేదు. ఎందుకంటే.. ‘మా’ ప్రస్తుత కార్యవర్గం కాల పరిమితి ఏప్రిల్ నాటికే పూర్తి అయినా… అక్కౌంట్స్ అప్పగించాలనే కారణంగా తమ కాలపరిమితిని సెప్టెంబర్ వరకూ పొడిగించుకుంటూ తీర్మానం చేసుకున్నారు. సో… ఆ లోగా ఎన్నికలు జరిగే ఛాన్స్ లేదు. ఎవరైనా ఈ నిర్ణయంపై కోర్టుకు వెళ్ళి ఎన్నికలు ముందు జరిగేలా చూడమని కోరితే తప్ప. దాంతో ప్రస్తుతం కార్యవర్గం ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టడం లేదు.

Read Also: 16 వేల మంది కాంట్రాక్టు వైద్య సిబ్బంది తొలగింపు

అయితే… ప్రకాశ్ రాజ్ వర్గం మాత్రం ఎంత త్వరగా ఎన్నికలు పెడితే, అంత త్వరగా తమ సత్తా చాటాలని కాచుకుని ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకూ మీడియాతో మాట్లాడనని చెప్పిన ప్రకాశ్ రాజ్ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో సోషల్ మీడియాను ఆశ్రయించాడని తెలుస్తోంది. ‘మా’ ఎన్నికలు ఇప్పుడప్పుడే ఉండవనే ఉద్దేశ్యంతో మీడియా కూడా దానికి ప్రాధాన్యం ఇవ్వడం తగ్గించేసింది. కానీ ఒక్కసారి తన ప్యానల్ సభ్యులను మీడియా ముందుకు తీసుకొచ్చిన ప్రకాశ్ రాజ్ మాత్రం ‘మా’ ఎన్నికల వేడి తగ్గకూడదని భావిస్తున్నట్లు ప్రస్తుత వ్యాఖ్యల బట్టి తెలుస్తోంది.

Read Also: కేబినెట్‌ విస్తరణకు వేళాయె..! నేతల ఢిల్లీ బాట

ఇదిలా ఉంటే… చిత్రసీమలోని పెద్దలు కొందరు ఈసారి ఎన్నికలకు వెళ్ళకుండా ఏకగ్రీవంగా ఓ కమిటీని ఏర్పాటు చేసే విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే ప్రకాశ్ రాజ్ ఏ ఎన్నికల గురించి ఇలా అడిగారో తెలియక కొందరు నెటిజన్లు రకరకాల ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి వారి కోసమైనా ప్రకాశ్ రాజ్ మరింత వివరంగా తన మనసులోని ఆలోచనలను బయట పెడతారేమో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-