‘మా’ అసోసియేషన్ ను.. ఓ చారిటీ అసోసియేషన్ చేశాం: ప్రకాష్ రాజ్

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌( మా ) ఎన్నికల అక్టోబరు 10న జరగనున్నాయన్న సంగతి తెలిసిందే.. మా అధ్యక్ష పోటీలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహా రావులు ఎన్నికల రేస్ లో ఉన్నారు. అయితే ప్రకాష్ ప్యానల్ ఎన్నికల క్యాంపెన్ వేగాన్ని పెంచింది. ఇప్పటికే విందు సమావేశాలు అంటూ ప్రకాష్ రాజ్ మీటింగ్ పెట్టగా.. మరోసారి మెంబర్స్ తో ‘మా ఎన్నికల’ను ఉద్దేశించి మాట్లాడారు.

ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ‘ఎలక్షన్స్ లో ఏ లీడరో.. ఏ ప్యానల్ లో గెలవదు, ఓడిపోదు.. మెంబర్స్ కరెక్ట్ గా ఎన్నుకొంటే మీరు గెలుస్తారు, ఎన్నుకోకబోతే మీరే ఓడిపోతారు. ఇది యుద్ధం కాదు, సమరం కాదు, క్రికెట్ మ్యాచ్ కాదు పట్టుబడి ఉండడానికి.. ఇవి ఎన్నికలు, ఇక్కడ మెంబర్స్ మాత్రమే ఉంటారు. అందరు మంచి చేయాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల్లో పోటీచేస్తారు. కానీ రకరకాల కారణాలతో చేయలేకపోతున్నారు. ఎన్నుకొనే ప్రక్రియే సరిగ్గా లేకనే ఇదంతా జరుగుతోందన్నారు.

నేను పెరిగిన పరిస్థితులు వేరు, ఆశ్రమంలో పెరిగాను.. నాకు చాలా కష్టాలు తెలుసు.. ఆ భాదలు తెలుసు కాబట్టే మా ఎన్నికల పోటీలో దిగాను. మా అసోసియేషన్ ను ఓ చారిటీ అసోసియేషన్ చేసేశాము. చావుబ్రతుల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలి, పదివేలు ఇచ్చారు, బియ్యం ఇచ్చారనేది కాదు మా అసోసియేషన్ అంటే.. వ్యక్తులను బలపరిచేలా, ఎదగనిచ్చే అసోసియేషన్ లా ఉండాలని’ ప్రకాష్ రాజ్ కోరారు. మరి ఆ పూర్తి మాటలను వినాలంటే ఈ వీడియోపై క్లిక్ చేయండి.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-