నరేశ్ ను టార్గెట్ చేసిన ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు

ఆదివారం ‘మా’కు జరిగిన ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుండి మొత్తం 11 మంది గెలిచారు. ఇందులో ఎనిమిది మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కాగా, శ్రీకాంత్ ఎగ్జిక్యూటివ్ వైప్ ప్రెసిడెంట్ గా, బెనర్జీ వైస్ ప్రెసిడెంట్ గా, ఉత్తేజ్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా గెలిచిన బ్రహ్మాజీ, సుడిగాలి సుధీర్ తప్ప మిగిలిన గెలిచిన సభ్యులంతా రాజీనామా ప్రకటన సమావేశంలో పాల్గొన్నారు. వీరితో పాటు ఓటమి పాలైన జీవిత, హేమ తదితరులు కూడా హాజరయ్యారు. ప్రకాశ్ రాజ్ బయటపడలేదు కానీ గతంలో ‘మా’ కార్యవర్గ సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరూ నరేశ్ కారణంగా తామెన్ని ఇబ్బందులు పడింది తెలిపారు.

బెనర్జీ, ఉత్తేజ్ మొదలుకొని సమీర్ వరకూ నరేశ్ నే టార్గెట్ చేశారు. నరేశ్ కొత్త కార్యవర్గంతోనూ సంక్షేమ కార్యక్రమాలు చేయించడని, వారిని తప్పుదారి పట్టిస్తాడని ఉత్తేజ్ ఆరోపించగా, నరేశ్ ను మంచు విష్ణు నమ్మితే నట్టేటముంచడం ఖాయమని సమీర్ అన్నారు. విష్ణును వెనక ఉండి ఆడించాలని నరేశ్ చూస్తున్నారని, ఆయన చాణుక్య పాత్ర పోషించినంత వరకూ ‘మా’ కార్యవర్గంలో ఉన్నా తామేమీ చేయలేమని, అందుకే రాజీనామా చేస్తున్నామని కొందరు విస్పష్టంగా చెప్పారు. అయితే వీరంత విష్ణు సమర్థుడని, అతనికి ‘మా’ సభ్యులను ఆదుకునే సత్తా ఉందని, అందుకు అవసరమైతే తామూ సహకరిస్తామని తెలిపారు. మొత్తం మీద నరేశ్ ను దూరంగా పెడితేనే… ‘మా’ సభ్యులకు మేలు చేయగలరనే విషయాన్ని డైరెక్ట్ గానే విష్ణు బృందానికి ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుండి గెలిచిన సభ్యులు చెప్పారు. మరి దీనిపై నరేశ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

-Advertisement-నరేశ్ ను టార్గెట్ చేసిన ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు

Related Articles

Latest Articles