మంచు ప్యానెల్‌పై ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు

‘మా’ రాజకీయం మరింత వేడెక్కింది. మంచు విష్ణు ప్యానెల్‌పై ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారు. 60 మందితో పోస్టల్ బ్యాలెట్ లో తమకు అనుకూలంగా మంచు విష్ణు ఓటు వేయించుకుంటున్నారని ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఎన్నికల సహాయ అధికారి నారాయణరావుకు శ్రీకాంత్, జీవితరాజశేఖర్ తో వచ్చి ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారు.. కొద్దిరోజులుగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ సభ్యుల మధ్య డైలాగ్ వార్ నడుస్తోన్న విషయం తెలిసిందే.

‘మా’ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఈ నెల 10న ఎన్నికలు జరుగనున్నాయి. పోటీ ఎవరి మధ్య అన్నది తేలిపోయింది. దీంతో గెలుపు కోసం మంచు విష్ణు ప్యానెల్ ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. దీంతో ప్రస్తుతం మా ఎన్నికలు హీటెక్కాయి.

-Advertisement-మంచు ప్యానెల్‌పై ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు

Related Articles

Latest Articles