పవన్ మద్దతు ఇచ్చారని ఎలా అంటారు? : ప్రకాష్ రాజ్

సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయారన్న విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఆయన తన ఓటమికి కారణం చెబుతూ ‘మా’ సభ్యుడిగా రాజీనామా చేశారు. ఇందులోకి జాతీయవాదం కూడా వచ్చింది. బీజేపీ నేత బండి సంజయ్ లాంటి నేతలు ట్వీట్ చేసి జాతీయవాదాన్ని నిలబెట్టినందుకు వాళ్లకు కంగ్రాజులేషన్స్ చెప్పారు అని అన్నారు. రచయితలతో, దర్శకనిర్మాతలతో, నటీనటులతో తన అనుబంధం కొనసాగుతుందని అన్నారు. ప్రాంతీయత ఆధారంగా ఎన్నికలు జరిగాయి. తెలుగు వ్యక్తే ‘మా’ అధ్యక్షుడిగా ఉండాలని అనుకున్నారు. తెలుగు బిడ్డను ఎన్నుకున్నారు. నన్ను నాన్ లోకల్ అన్న కోట శ్రీనివాసరావు, రఘుబాబు మాటలని గౌరవిస్తా అని అన్నారు.

Read Also : ‘మా’లో ముసలం మొదలు కాబోతోందా!?

ఇప్పుడు రాజీనామా చేసేకన్నా నెక్స్ట్ టర్మ్ లో పోటీ చేసి గెలవొచ్చు కదా అని ప్రశ్నించిన విలేఖరికి ‘ఇలాంటి అజెండా ఉన్న అసోసియేషన్ లో నేను చేయను’ అని చెప్పారు. పవన్ కళ్యాణ్ రెండుసార్లు ఓడిపోయినా ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. మీరు ఎందుకు కంటిన్యూ చేయడం లేదన్న ప్రశ్నకు ‘స్టేట్ పాలిటిక్స్ వేరు. అసోసియేషన్ మాత్రమే సినిమా ఇండస్ట్రీ కాదు’ అని అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారా ? అని అడగ్గా ‘ఓటు ఎవరు వేశారన్న విషయం తెలియదు కదా. మద్దతు ఇచ్చారని ఎలా అంటారు? నేను అవన్నీ తరువాత విశ్లేషించుకుంటాను” అని సమాధానం ఇచ్చారు.

-Advertisement-పవన్ మద్దతు ఇచ్చారని ఎలా అంటారు? : ప్రకాష్ రాజ్

Related Articles

Latest Articles