‘మా’ సీసీటీవీ ఫుటేజ్ వివాదం… స్కూల్ కు చేరుకున్న ప్రకాష్ రాజ్

‘మా’ ఎన్నికల వివాదంలో సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా మారింది. ఓడిపోయిన ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఎన్నికల సమయంలో తమపై దౌర్జన్యం చేశారని, దాడి చేశారని ఆరోపిస్తూ ‘మా’ ఎన్నికలపై కోర్టుకు వెళ్తామని, అయితే అంతకన్నా ముందు సీసీటీవీ ఫుటేజ్ చూస్తామని కోరుతూ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కు లేఖ రాశారు. అయితే కృష్ణమోహన్ మాత్రం దానికి కొన్ని పద్ధతులు ఉంటాయని ఎవరు పడితే వాళ్ళు అడిగితే సీసీటీవీ ఫుటేజ్ చూపించలేమని అన్నట్లు ప్రకాష్ రాజ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో నిన్న ఎన్నికలు జరిగిన జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ సీసీటీవీ ఫుటేజ్ రూమ్ ను సీజ్ చేశారు. ఆ సర్వర్ రూమ్ కు తాళం వేసిన పోలీసులు రెండు ప్యానళ్ల సభ్యులందరూ ఉంటేనే సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చని క్లారిటీ ఇచ్చారు.

Read Also : సీసీటీవీ ఫుటేజ్ వివాదంపై మంచు విష్ణు కామెంట్స్

తాజాగా ప్రకాష్ రాజ్ తో పాటు ఆయన ప్యానల్ సభ్యులు శ్రీకాంత్, తనీష్ వంటివారు స్కూల్ దగ్గరకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ తనకు ఎన్నికలపై కొన్ని అనుమానాలు ఉన్నాయని అన్నారు. విష్ణుపై తనకేం కోపం లేదని, ఆయన ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తన పని తాను చేసుకుంటున్నాడు. పైగా సీసీటీవీ ఫుటేజ్ చూడమని తనకు అభ్యంతరం లేదని చెప్పాడు బాగుంది. కానీ ఎన్నికల అధికారి మాత్రం ఒప్పుకోలేదు. కాబట్టి ఈ ఫుటేజ్ చుశాకనే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రస్తుతం పోలీసులతో పాటు ప్రకాష్ రాజ్ బృందం సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. మరోవైపు విష్ణు ప్యానల్ సభ్యులు మాత్రం తిరుమల సందర్శనలో ఉన్నారు.

Related Articles

Latest Articles