కెజియఫ్ దారిలోనే ప్రభాస్ ‘సలార్’!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ‘స‌లార్‌’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని.. హోంబ‌లే ఫిలింస్ నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందించ‌నున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ప్ర‌శాంత్ నీల్ దర్శకత్వం వహించిన కె.జి.య‌ఫ్ చిత్రం త‌ర‌హాలోనే స‌లార్ కూడా రెండు పార్టులుగా రానున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్​ ద్విపాత్రాభినయం చేయనున్నారని సమాచారం. కథను​ దృష్టిలో పెట్టుకుని రెండు భాగాలుగా చేయాలని చిత్రబృందం యోచిస్తుందని తెలుస్తోంది. కరోనా సెకండ్ వేవ్ వల్ల నిలిచిపోయిన షూటింగ్.. త్వరలోనే ప్రారంభం కానుంది. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ఇదివరకే ప్ర‌క‌టించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-