వీడియో లీక్ : షూటింగ్ లో ప్రభాస్ ఇలా..!

“బాహుబలి”, “సాహో” తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భారతీయ నిర్మాణ సంస్థలలో అత్యంత డిమాండ్ ఉన్న నటులలో ఒకరిగా మారారు. ప్రభాస్ ప్రస్తుతం యాక్షన్ డ్రామా “సలార్” సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. “కేజీఎఫ్” ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శృతి హాసన్ ఈ చిత్రంలో ప్రభాస్ తో రొమాన్స్ చేస్తోంది. ప్రభాస్ తో శృతి కలిసి పని చేయడం ఇదే మొదటిసారి. తాజాగా “సలార్” సెట్స్ నుండి ప్రభాస్ వీడియో, కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఒక చిత్రంలో ప్రభాస్ నటుడు, కమెడియన్ ప్రభాస్ శ్రీనుతో కనిపిస్తారు. ఇక వీడియోలో షూటింగ్ లొకేషన్ లో ప్రభాస్ నడుస్తూ కన్పించాడు. ఆ వీడియో ప్రభాస్ లుక్ చూసిన అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

Read Also : “ఆర్ఆర్ఆర్” టీం ఉక్రెయిన్ లోనే మరికొన్ని రోజులు!

ప్రస్తుతం మేకర్స్ ఓ మాస్ సాంగ్ ను షూట్ చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ పాటను చాలా గ్రాండ్‌గా చిత్రీకరించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని, అందుకోసం సన్నాహాలు మొదలు పెట్టారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. “సలార్” కన్నడ, తెలుగు భాషలలో ఒకేసారి చిత్రీకరించబడుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హిందీ, తమిళం, మలయాళంలో కూడా డబ్ చేయబడుతుంది. ఈ చిత్రంతో కన్నడ చిత్ర పరిశ్రమలో శృతి హాసన్ అరంగేట్రం చేస్తుంది. దీనిని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగండూర్ నిర్మిస్తున్నారు. 14 జనవరి 2022న ఈ మూవీ భారీ ఎత్తున థియేటర్లలోకి రానుంది.

-Advertisement-వీడియో లీక్ : షూటింగ్ లో ప్రభాస్ ఇలా..!

Related Articles

Latest Articles