‘స్పిరిట్’ లో ప్రభాస్ రోల్ ని రివీల్ చేసిన నిర్మాత.. ఫ్యాన్స్ కి పూనకాలే

యంగ్ రెబల్ శస్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా మూవీలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాధేశ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఆదిపురుష్ షూటింగ్ ని కూడా పూర్తి చేసిన ప్రభాస్ ప్రస్తుతం సలార్ షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇక ఈ సినిమా తరువాత అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. కేవలం టైటిల్ టోన్ ఒక రేంజ్ లో అంచనాలను పెంచేసిన ఈ సినిమా గురించి ఓకే క్రేజి అప్డేట్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది.

ఆదిపురుష్ నిర్మాత భూషణ్ కుమార్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో స్పిరిట్ లో ప్రభాస్ రోల్ ని రివీల్ చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ టిపికల్ పోలీస్ కాప్ గా కనిపించబోతున్నాడంట. ఇప్పటివరకు ప్రభాస్ పోలీస్ గా ఒక్కసారి కూడా కనిపించలేదు. ఇందులోనే మొట్ట మొదటిసారి పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నాడని చెప్పాంతో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. తమ అభిమాన హీరో తమ డ్రీమ్ ని నిజం చేస్తున్నాడని, ప్రభాస్ ని ఎప్పటి నుంచో పోలీస్ పాత్రలో చూడాలనుకొంటున్నామని అది స్పిరిట్ తో తీరిపోతుందని అంటున్నారు. మరి ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్ అందరు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

Latest Articles