‘రాధేశ్యామ్’ వాయిదా… కొత్త డేట్ ఫిక్స్

‘ఆర్ఆర్ఆర్’ వాయిదా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియన్ ఎపిక్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’ విడుదల గురించి చాలా ఊహాగానాలు విన్పిస్తున్నాయి. సినిమా వాయిదా తప్పదు అంటూ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ రూమర్స్ కు సమాధానంగా అనుకున్న ప్రకారం జనవరి 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ అధికారిక ప్రకటనలు చేస్తూ వచ్చారు. కానీ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో పాటు మరోమారు కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ కోవిడ్ దేశంలో సృష్టిస్తున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ‘రాధే శ్యామ్’ వాయిదా గురించి మేకర్స్ పంపిణీదారులు తెలియజేసినట్టు తాజా సమాచారం. అయితే మార్చి వరకు కరోనా కనుక తగ్గితే మార్చి 18న సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇదే విషయాన్నీ మరికాసేపట్లో ఓ ప్రెస్ నోట్ ద్వారా ‘రాధేశ్యామ్’ టీం ప్రకటించబోతోంది అంటున్నారు.

Read Also : “పుష్ప”పై మహేష్ సెన్సేషనల్ రివ్యూ

రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ సాగా ‘రాధే శ్యామ్’. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా వ్యవహరిస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లను మూసివేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత అజిత్ ‘వాలిమై’ విడుదల కూడా వాయిదా పడింది. తమిళనాడు, బీహార్, పశ్చిమ బెంగాల్, న్యూఢిల్లీ రాష్ట్రాలు థియేటర్లను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాలోని థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో పని చేస్తాయి. ఈ వారాంతంలో టాలీవుడ్ సినిమాల విడుదల తేదీలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related Articles

Latest Articles