మహేష్ బాబు కథతో ప్రభాస్ సినిమా

‘అర్జున్ రెడ్డి’తో ఓవర్ నైట్ స్టార్ డైరక్టర్ స్టేటస్ అందుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఆ తర్వాత అదే సినిమాను హిందీలో తీసి మరో సూపర్ హిట్ కొట్టాడు. దీంతో అందరు హీరోల కన్ను సందీప్ పై పడింది. పలువురు హీరోలతో సందీప్ సినిమా అంటూ ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఏది కార్యరూపం దాల్చలేదు. నిజానికి ‘అర్జున్ రెడ్డి’ తర్వాత మహేశ్ బాబుతో సినిమా చేస్తాడని భావించారు. పవర్ ఫుల్ కథను మహేశ్ కి వినిపించాడట. అందులో భాగంగా మహేశ్ ని కలవటం, పార్టీలకు వెళ్ళటం కూడా చేశారు. మహేశ్ పుట్టిన రోజు ఫ్యాన్స్ నిర్వహించిన ట్విట్టర్ సెషన్ లో కూడా పాల్గొన్నాడు. అందులో మహేశ్ ని తప్పక డైరెక్ట్ చేస్తానని చెప్పాడు. తను చెప్పిన కథ మహేశ్ కి నచ్చలేదని, మరో కొత్త కథతో అప్రోచ్ అవుతానని అన్నాడు.

Read Also : సమంత ఆవేదన

ఇటీవల సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ తో ప్యాన్ ఇండియా మూవీగా ‘స్పిరిట్’ తీస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది ప్రభాస్ 25వ సినిమా కావటం విశేషం. అయితే దీనిని రణ్‌ బీర్ కపూర్ తో తీయబోతున్న ‘యానిమల్’ తర్వాత పట్టాలెక్కిస్తాడట. ఇక ప్రభాస్ తో తీయబోయే సినిమా ఆయన ఇమేజ్‌ని మార్చేంత బలంగా ఉంటుందంటున్నారు. నిజానికి సందీప్ వంగా మొదట మహేష్‌కు చెప్పిన కథలో మార్పులు, చేర్పులు చేసి ప్రభాస్‌ని సంప్రదించినట్లు సమాచారం. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, స్టైల్‌కి సరిపోయేలా సందీప్ హీరో క్యారెక్టరైజేషన్‌ను తీర్చిదిద్దాడట. ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ సంస్థ టీ సీరీస్ నిర్మించనుంది. సందీప్ తీసిన ‘కబీర్ సింగ్’కి టీ సీరీస్ కూడా నిర్మాత కావటం విశేషం. సందీప్ చెప్పిన కథ నచ్చటంతో ప్రభాస్‌తో చేయటానికి రెడీ అయింది టీ సీరీస్. మరి ప్రభాస్ తో తీయబోతున్న ‘స్పిరట్’ మహేశ్ బాబుకు చెప్పిన కథేనా? లేక వేరేనా? అన్నది తేలాల్సి ఉంది.

-Advertisement-మహేష్ బాబు కథతో ప్రభాస్ సినిమా

Related Articles

Latest Articles