ప్రభాస్ మూవీ కొచ్చి ఆడిషన్స్ క్యాన్సిల్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే హీరోహీరోయిన్లుగా నాగఅశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ పతాకంపై సీనియర్ నిర్మాత అశ్వనీదత్ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ‘ప్రాజెక్ట్ కె’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ లో ఆల్ ఇండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇప్పటికే పాల్గొన్నారు. ఈ సినిమాను నాగ అశ్విన్ గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కించబోతున్నారు. అందుకోసం జండర్, ఏజ్ తో నిమిత్తం లేకుండా యాక్టర్స్, మోడల్స్, మార్షల్ ఆర్టిస్ట్స్, డాన్సర్స్ కోసం ఆడిషన్స్ మొదలు పెట్టారు. ప్రధానంగా బెంగళూర్, చెన్నయ్, పాండిచ్చేరి, కొచ్చిలో ఇవి జరుగుతున్నాయి. నిన్న చెన్నయ్ లో ఆడిషన్స్ పూర్తి చేసిన ఈ చిత్ర యూనిట్ ఇవాళ బెంగళూర్ లో ఆడిషన్స్ జరుపుతోంది. అయితే ఈ నెల 15న కొచ్చిలో జరగాల్సిన ఆడిషన్స్ ను కొవిడ్ నిబంధనల కారణంగా రద్దు చేసినట్టు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ తెలిపింది. తిరిగి ఎప్పుడు ఆడిషన్స్ జరిపేది త్వరలో తెలియచేస్తామని చెప్పింది.

Related Articles

Latest Articles

-Advertisement-