ఇంగ్లాండ్ వెళ్ళిన ప్రభాస్… బరువు తగ్గడానికేనా!?

ప్రభాస్ ఇప్పుడు తన కెరీర్ లో ఎప్పుడూ లేనంత స్పీడ్ గా సినిమాలు చేస్తున్నాడు. ‘బాహుబలి’ సీరీస్, ‘సాహో’తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ప్రస్తుతం ఓంరౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ ‘సలార్’ సినిమా షూటిం్ లతో బిజీగా ఉన్నాడు. ‘ఆదిపురుష్’లో ప్రభాస్ శ్రీరాముడి పాత్ర పోషిస్తున్నారు. ఈ పాత్ర పోషణ విషయంలో దర్శకుడు ఓంరౌత్ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా కారణంగా షూటింగ్ లేకపోవడంతో ప్రభాస్ బరువులో వచ్చిన హెచ్చు తగ్గులపై దర్శకుడు దృష్టి సారించారట. తన సినిమాలో లుక్ పరంగా కంటిన్యూటీ మిస్ కాకూడదని ప్రభాస్ ని కోరాడట.

Read Also : ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ మరోసారి వాయిదా!

అందుకే తన శరీరంలో వచ్చిన మార్పులు పాత్రల పోషణకు ఇబ్బంది కాకూడదనే తలంపుతో ఇగ్లాండ్ పయనమయ్యాడట ప్రభాస్. యూకే లో ని వరల్డ్ క్లాస్ డాక్టర్ కమ్ డైటీషన్ వద్ద మెరుగైన చికిత్స తీసుకోబోతున్నాడట. ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ సంక్రాంతికి విడుదల కానుంది. ఇక ‘సలార్, ఆదిపురుష్‌’ చిత్రాలను పూర్తి చేసి నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ మూవీపై దృష్టి సారించాడు ప్రభాస్. ఆ తర్వాత ప్రభాస్ తన 25వ సినిమాని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజుకి చేయబోతున్నట్లు సమాచారం. ఇది కూడా ప్యాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కనున్నట్లు వినికిడి. ఈ సినిమా 2023 ఆఖరులో ఉంటుందట.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-