నాగ్ అశ్విన్ బర్త్ డే… ట్రెండ్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్

ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ సెలెబ్రిటీలతో పాటు నెటిజన్లు నాగ్ అశ్విన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి విభిన్నమైన చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నాగ్ అశ్విన్… మొదటి చిత్రంతోనే హిట్ అందుకుని తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తరువాత ‘మహానటి’తో ప్రేక్షకులను మెప్పించి జాతీయ అవార్డును అందుకున్నాడు. ఇటీవలే ‘జాతి రత్నాలు’తో నిర్మాతగా మారి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. మూడు చిత్రాలతోనే దర్శకుడిగానూ, నిర్మాతగానూ సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో పాన్ ఇండియా సినిమాను రూపొందించడానికి సిద్ధమయ్యాడు. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా… అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ నిర్మించనుంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో #HBDNagAshwin అనే హ్యాష్ ట్యాగ్ ను భారీ ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు సమంత అక్కినేని కూడా ‘మహానటి’ సమయంలో నాగ్ అశ్విన్ తో తీసుకున్న ఫోటోను షేర్ చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-