‘ప్రభాస్’ రాజు ఎక్కడైనా రాజే..

ఈశ్వర్ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్.. రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా అడుగుపెట్టిన ప్రభాస్.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఈ సినిమా తరువాత ప్రభాస్ లైఫ్ మారిపోయింది అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేసేవాణ్ణి పాన్ ఇండియా మూవీసే.. ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ తెలియనివారు లేరు. ఇప్పటికే పలు రికార్డులను కైవసం చేసుకున్న ఈ హీరో .. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల్లో ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నాడు. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ స్పిరిట్ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ మూవీకి ప్రభాస్ ఏకంగా 150 కోట్లు రెమ్యూనిరేషన్ తీసుకొంటున్నట్లు సమాచారం. వామ్మో.. ప్రభాస్ పారితోషికమే 150 కోట్లు అయితే మేకింగ్ కు అయ్యే ఖర్చు ఎంత ఉంటుందో అని ప్రేక్షకులు నోర్లు వెళ్లబెడుతున్నారు. మరోపక్క ప్రభాస్ రికార్డును అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

రాజు ఎక్కడున్నా రాజే అని బాహుబలిలో నాజర్ డైలాగ్ ని వాడుతూ ప్రభాస్ రాజు ఎక్కడున్నా రాజేరా అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఆది పురుష్ షూటింగ్ ని పూర్తీ చేసి, సలార్ , నాగ అశ్విన్ చిత్రాల షూట్లో బిజీగా ఉన్నాడు. ఈ రెండు అయ్యాకా స్పిరిట్ షూటింగ్ పట్టాలెక్కనుంది.

Related Articles

Latest Articles