ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ !!

దేశంలో ప్రస్తుతం అత్యంత పాపులర్ హీరోలలో మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు ప్రభాస్. అయితే అంతకంతకూ ఆయన అభిమానగణం కూడా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కు మంచి ఫ్యాన్స్ బేస్ ఉంది. అయితే వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంత అయ్యి ఉంటుంది ? అక్షరాలా 150 కోట్లు. ఇప్పుడు బిటౌన్ సమాచారం ప్రకారం నిజంగానే ప్రభాస్ 150 కోట్ల రెమ్యూనరేషన్ ను అందుకుంటున్నారు.

Read Also : “లైగర్” రాకకు అడ్డుపడుతున్న రీజన్ ఇదే !

ప్రస్తుతం ప్రభాస్ “ఆదిపురుష్” సినిమా చేస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. “ఆదిపురుష్” షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం విజువల్ ఫీస్ట్ గా ఉంటుందని, ‘ఆదిపురుష్’ ఒక VFX హెవీ ఫిల్మ్ ప్లస్ అని చెబుతున్నారు మేకర్స్. ఈ సినిమా బడ్జెట్ రూ .500 కోట్లు. ఈ మూవీ కోసం ప్రభాస్ 150 కోట్లు పారితోషికంగా వసూలు చేస్తున్నాడని తెలుస్తోంది. సౌత్ ఇండియాలో ఇంత భారీ మొత్తం పారితోషికంగా అందుకున్న మొట్ట మొదటి నటుడు ప్రభాస్ కావడం విశేషం. ‘ఆదిపురుష్’ 11 ఆగస్టు 2022 న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. టి సిరీస్, రెట్రోఫైల్స్ పతాకాలపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ ఈ 3D చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

-Advertisement-ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ !!

Related Articles

Latest Articles