దీపికాకు బర్త్ డే విషెస్ తెలిపిన ప్రభాస్

బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొనే నేడు తన 36 వ పుట్టినరోజును జరుపుకొంటుంది. ట్విట్టర్ లో ఉదయం నుంచి దీపికాకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, దీపికాకు బర్త్ డే విషెస్ తెలిపారు. తన ఇన్స్టాగ్రామ్ ద్వారా దీపికా ఫోటోను షేర్ చేస్తూ” అందమైన నవ్వు కలిగిన దీపికా పదుకొనే కి పుట్టినరోజు శుభాకాంక్షలు.. నీ ఎనర్జీ,  టాలెంట్ తో ప్రాజెక్ట్ కె సెట్.. మరింత ప్రకాశంవంతంగా మారింది. నువ్వు ఎల్లప్పుడు బెస్ట్ గా ఉండాలని కోరుకొంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

Related Articles

Latest Articles