యంగ్ రెబల్ స్టార్ తో త్రివిక్రమ్ సినిమా!

కొన్ని కాంబినేషన్స్ వినడానికి భలే క్రేజీగా ఉంటాయి. అలాంటిదే ప్రభాస్ – త్రివిక్రమ్ కాంబో! కథానాయకుడిగా పాతిక చిత్రాల మైలురాయికి ప్రభాస్ చేరువ కాబోతున్నా… ఇంతవరకూ త్రివిక్రమ్ డైరెక్షన్ లో అతను ఒక్క సినిమాలోనూ నటించలేదు. దాంతో త్రివిక్రమ్ రాసే డైలాగ్స్ ను ప్రభాస్ నోటి వెంట వినాలని, అలానే ఈ యంగ్ రెబల్ స్టార్ తో చక్కని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను త్రివిక్రమ్ తీస్తే చూడాలని ఫ్యాన్స్ ఉవ్విళ్ళూరుతున్నారు.

Read Also : కాజల్, కియారా, సమంతని బీట్ చేసిన ‘భీష్మ’ బ్యూటీ!

ఫిల్మ్ నగర్ తాజా ఖబర్ ఏమిటంటే… వీరిద్దరి కాంబినేషన్ లో ఓ మూవీ సెట్ కాబోతోందట. త్రివిక్రమ్ చెప్పిన ఓ కథకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే… ప్రస్తుతం త్రివిక్రమ్… మహేశ్ బాబు మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా ఉన్నాడు. అలానే మరో రెండు ప్రాజెక్ట్స్ కు కమిటై ఉన్నాడు. ఇక ప్రభాస్ ఏకంగా మూడు సినిమాలను లైన్ లో పెట్టి యమ బిజీగా ఉన్నాడు. సో…. ఇవన్నీ పూర్తి అయిన తర్వాత త్రివిక్రమ్ మూవీలో ప్రభాస్ నటిస్తాడనేది ఖాయం అంటున్నారు. చూద్దాం… ఏం జరుగుతుందో!!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-