రామ్-లింగుసామి సినిమాలో పవర్ ఫుల్ విలన్!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇటీవలే తమిళ డైరెక్టర్ లింగుసామితో ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎవరు ఊహించని కాంబినేషన్ కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఈనెల 12 నుంచి హైదరాబాద్‌లో షూటింగ్ మొదలైంది. రామ్ సరసన హీరోయిన్‌గా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రానికి ‘ఉస్తాద్’ అనే పేరును దాదాపు ఖాయం చేసినట్లే తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో విలన్ గా తమిళ నటుడు ఆర్య నటించనున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు ఆయనతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఆర్య హీరోగానే కాకుండా విభిన్న పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ ను ఢీకొట్టబోయేది ఆర్యననే ప్రచారం కూడా కోలీవుడ్ లో ఎక్కువగా జరుగుతోంది. ఈ సినిమాను ఎస్ ఎస్ స్క్రీన్స్ బ్యానర్ లో శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-