తగ్గేదేలే.. సంక్రాంతికే ‘భీమ్లా నాయక్’!

ఈసారి సంక్రాంతికి గట్టి పోటీ రానుంది. పాన్ ఇండియా మూవీస్ సంక్రాంతి బరిలోకి దిగుతున్నాయి. ఒకదానికి మించి ఒకటి సై అంటే సై అంటూ పోటీకి సిద్దమవుతున్నాయి. చిత్ర పరిశ్రమ అంతా సంక్రాంతి వైపే చూస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులందరూ ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’ ఈ సంక్రాంతికి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఇక వీరితో పాటు రంగంలోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కూడా దిగిపోయింది.

‘భీమ్లా నాయక్’ వెనకకి తగ్గుతోందని, వేరే రిలీజ్ డేట్ వెతుకుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ వార్తలకు మరోసారి చెక్ పెట్టారు చిత్ర యూనిట్.. అస్సలు వెనక్కి తగ్గేదేలే అంటూ కొత్త పోస్టర్ తో రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ముందు నుంచి అనుకుంటున్నట్లే జనవరి 12 న ‘భీమ్లా నాయక్’ థియేటర్లలలో సందడి చేయనుంది. దీంతో సంక్రాంతికి గట్టి పోటీ ఉండనుంది. జనవరి 7న ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కానుండగా జనవరి 14న ‘రాధే శ్యామ్’ బరిలోకి దిగుతుంది. వారం రోజుల గ్యాప్ లో మూడు అల్టిమేట్ సినిమాలు థియేటర్లో క్లాష్ కానున్నాయి. మరి ఈ చిత్రాల్లో ఏది సంక్రాంతి హిట్ గా నిలవనుందో చూడాలి.

Related Articles

Latest Articles