దేశంలో పొంచి ఉన్న విద్యుత్ సంక్షోభం..!?

బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలలో బొగ్గు నిల్వలు పడిపోయాయి. గత నెల చివరినాటికి సగటున నాలుగు రోజులకు సరిపడా నిల్వలను మాత్రమే కలిగి ఉన్నాయి దేశంలో ని సగానికి పైగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు. బొగ్గు కొరతను ఎదుర్కుంటున్నాయి దేశంలోని సుమారు 135 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు. ఆగస్టు ప్రారంభంలో 13 రోజులకు సరిపడా నిల్వలను కలిగి ఉన్నాయి విద్యుత్ కేంద్రాలు. దేశంలో సగానికి పైగా బొగ్గుఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో సరఫరా అంతరాయం ఏర్పడనుంది. బొగ్గు సరఫరా కొరత తీవ్రతరం కావడంతో ఆర్థిక వ్యవస్థ పై వేగంగా విస్తరిస్తుంది
తీవ్ర ప్రభావం. దేశంలో దాదాపు 70 శాతం విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి బొగ్గు ఉపయోగించడంతో స్పాట్ పవర్ రేట్లు పెరిగాయి.

ఇక అల్యూమినియం స్మెల్టర్లు, స్టీల్ మిల్లులతో సహా కీలక వినియోగదారుల నుంచి ఇంధన సరఫరా మళ్లింపు జరుగుతుంది. దాంతో చైనా లో లాగే, భారతదేశం లో కూడా విద్యుత్ సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంది. “కోవిడ్” నియంత్రణలు రద్దు అయున తరువాత, బాగా పడిపోయింది స్థానిక బొగ్గు ఉత్పత్తి. పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకోవడంతో దేశవ్యాప్తంగా విద్యుత్ వాడకం పెరిగింది. కానీ భారీ వర్షాల వల్ల బొగ్గు గనులు, కీలక రవాణా మార్గాలను వరదలు ముంచెత్తాయి.

-Advertisement-దేశంలో పొంచి ఉన్న విద్యుత్ సంక్షోభం..!?

Related Articles

Latest Articles