భూలోక న‌ర‌కం: అంద‌మైన దీవిలో శవాల దిబ్బ‌లు…

అది అంద‌మైన దీవి.  ఇట‌లీలోని వెనీస్ న‌గ‌రానికి  కూత‌వేటు దూరంలో ఓ చిన్న దీవి ఉంది.  ఈ దీవిపేరు పోవెగ్లియా.  దీనికి అర్ధం సుంద‌ర‌మైన దీవి అని.  కానీ, ఇట‌లీ ప్ర‌జ‌లు మాత్రం ఈ దీవిని దెయ్యాల దిబ్బ‌గా పిలుస్తారు.  ప్ర‌జ‌లు నివాసానికి అనుకూలంగా ఉన్న‌ప్ప‌టికీ, అక్క‌డ దీవిలోకి అడుగుపెట్టాలంటే గుండెలు జారిపోతాయి.  అడుగ‌డుగున భ‌యంతో వ‌ణికిపోతారు.  దీని వెనుక చాలా పెద్ద కారణం ఉన్న‌ది.  16 వ శ‌తాబ్దంలో ఇట‌లీలో ప్లేగు వ్యాధి వ్యాపించింది.  ఈ ప్లేగు వ్యాధి కార‌ణంగా ఇట‌లీలో సుమారు ల‌క్ష మంది చ‌నిపోయారు.  అయితే, ప్లేగు వ్యాధి వ్యాపించిన స‌మ‌యంలో వ్యాధి సోకిన రోగుల‌ను పోవేగ్లియాలో ప‌డేసేవారు.  అక్క‌డ వారికి ఎలాంటి చికిత్స అందేది కాదు.  భ‌యంక‌ర‌మైన న‌ర‌కాన్ని అనుభ‌విస్తూ ఆ దీవిలోనే మ‌ర‌ణించారు.  అందుకే ఆ దీవికి భూలోక న‌ర‌కం అనే పేరు వ‌చ్చింది.   1920 త‌రువాత ఆ దీవిని టూరిస్ట్ ప్రాంతంగా మార్చాల‌ని ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ వెనీస్ న‌గ‌రం వ‌ర‌కు వ‌చ్చిన ప్ర‌జ‌లు పోవేగ్లియాలో అడుగుపెట్టేవారు కాద‌ట‌. 

Read: ఆ దేశాల్లోనే అలా ఎందుకు…?

Related Articles

Latest Articles

-Advertisement-