మార్చిలో అహ్మదాబాద్ జైడస్ క్యాడిలా వ్యాక్సిన్...
ఇండియాలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నా రాబోయే రోజుల్లో సెకండ్ వేవ్ వ్యాపించే అవకాశం ఉందని నివేదికలు వస్తుండటంతో ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇండియాలో మొత్తం మూడు వ్యాక్సిన్లు తయారవుతున్నాయి. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జైడస్ క్యాడిలా సంస్థ నుంచి ఓ వ్యాక్సిన్ తయారవుతుంది. డిఎన్ఏ ఆధారంగా వ్యాక్సిన్ తయారు అవుతున్నది. జైకోవ్ డి వ్యాక్సిన్ రెండో దశ ప్రయోగాలు విజయవంతం అయినట్టు కంపెనీ పేర్కొన్నది. వచ్చే నెలలో మూడోదశ వ్యాక్సిన్ ప్రయోగాలు చేయబోతున్నారు. ఈ ట్రయల్స్ మార్చి వరకు పూర్తవుతాయని అన్ని అనుకున్నట్టుగా జరిగితే వచ్చే ఏడాది మార్చి నుంచి వ్యాక్సిన్ దేశంలో అందుబాటులోకి వస్తుందని జైడస్ ఫార్మా పేర్కొన్నది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)