స్పెషల్ విషెస్ అందుకున్న ధోని... భార్య నుండి కాదు..! 

స్పెషల్ విషెస్ అందుకున్న ధోని... భార్య నుండి కాదు..! 

ఈ రోజు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పుట్టిన రోజు సందర్బంగా ఆయన చాల మంది అభిమానులు, ఆటగాళ్లు, సెలబ్రెటీల విషెస్ అందుకున్నారు. కానీ వారందరికంటే ప్రత్యేకమైన వ్యక్తి వద్ద నుండి ధోని ఇప్పుడు విషెస్ అందుకున్నాడు. అయితే ఆ ప్రత్యేకమైన వ్యక్తి తన భార్య కాదు. మరి ఎవరంటే.. ఐపీఎల్ మ్యాచ్ లో ధోని ఎంత ఫెమాసో మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని కూతురు 'జివా' కూడా అంతే ఫెమస్. ఇక జివా కు ఓ ఇంస్టాగ్రామ్ అకౌంట్ దానికి 1.6 మంది మిల్లియన్లకు పైగా ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అయితే అందులో... జివా "హ్యాపీ బడే పాపా! ఇది నా పాపా కోసం! ఐ లవ్ యు ??" అనే క్యాప్షన్‌తో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఉన్న ఫోటోలలో జివా అలాగే ధోని ఉన్నారు. అయితే ధోనికి తన కూతురు అంటే ఎంత ఇష్టమే అందరికి తెలుసు. కాబట్టి ఈ రోజు తనకు వచ్చిన అన్ని విషెస్ లలో ఇది చాల ప్రత్యేకమైనది.