ఇంగ్లాండ్-పాకిస్థాన్ : క్రాలే.. వన్ మ్యాన్ షో

ఇంగ్లాండ్-పాకిస్థాన్ : క్రాలే.. వన్ మ్యాన్ షో

మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య మూడో టెస్ట్ నిన్న ప్రారంభమైంది. అందులో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ జట్టు బ్యాట్స్మెన్స్ పాక్ బౌలర్లను బాదేశారు. నిన్న ఇంగ్లండ్‌ ఆటగాడు జాక్‌ క్రాలే (171*) శతకంతో మెరిశాడు. ఆ తరువాత అతనికి వికెట్ కీపర్ జోస్‌ బట్లర్‌ (87*) తోడయ్యాడు. ఇంగ్లాండ్ జట్టు మొదటి వికెట్ ను 12 పరుగుల వద్ద చేజార్చుకుంది. అప్పుడు బ్యాటింగ్ కు వచ్చిన క్రాలే నికడగా ఆడుతూ వస్తున్నాడు. ఓ దశలో జట్టు 127 పరుగులకు 4 వికెట్లు చేజార్చుకుంది. కానీ అప్పటికే గ్రౌండ్ లో కుదురుకున్న క్రాలే ఆ తర్వాత వచ్చిన బట్లర్‌ తో కలిసి 205 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దాంతో ఆట ముగిసే సమయానికి జట్టు మరో వికెట్ పడకుండా 332 పరుగులు చేసింది. నిన్న వన్ మ్యాన్ షో చేసిన క్రాలే ఈ రోజు ఆట ప్రారంభమైన తర్వాత డబల్ సెంచరీ సాధిస్తాడా.. లేదా చూడాలి. ఇక పాక్ బౌలర్లలో యాసిర్ షా 2 వికెట్లు తీసుకోగా షాహీన్ అఫ్రిది, నసీమ్ షా చెరొక వికెట్ పడగొట్టారు.