కోచ్ గా జహీర్?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-12లో ముంబై ఇండియన్స్ జట్టుకు టీం ఇండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ బౌలింగ్ కోచ్‌గా నియమితులవనున్నారు. ఈ మేరకు ముంబై జట్టు యాజమాన్యం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ జట్టు బౌలింగ్ కోచ్‌గా ఉన్న లసిత్ మలింగా లంక జట్టు తరుపున ప్రపంచకప్‌పై దృష్టిసారించడంతో.. అతని స్థానంలో జహీర్‌ని బౌలింగ్ కోచ్ గా నియమించాలని చూస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకూ ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
జహీర్ ఇప్పటివరకూ ముంబై జట్టుకి మూడు సీజన్లు ప్లేయర్ గా ఆడాడు. అనంతరం ముంబైకి మెంటార్ గా ఉన్నాడు. ఐపీఎల్-11లో ముంబై ఇండియన్స్ జట్టు అంతగా రాణించలేదు. మూడుసార్లు ఛాంపియన్స్‌గా నిలిచిన ముంబై ఈ సీజన్లో మాత్రం ప్లేఆఫ్స్‌కి కూడా చేరుకోలేకపోయింది. దీంతో రాబోయే సీజన్లో జట్టును మరింత పటిష్టంగా చేసేందుకు జహీర్ ను జట్టు బౌలింగ్ కోచ్ గా నియమిస్తుంది. మహేల జయవర్ధనే బ్యాటింగ్ కోచ్ గా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లసిత్ మలింగా మళ్లీ ఆక్షన్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)