హార్దిక్ అందుకే బౌలింగ్ చేయడం లేదు : జహీర్‌ ఖాన్‌

హార్దిక్ అందుకే బౌలింగ్ చేయడం లేదు : జహీర్‌ ఖాన్‌

భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గురించి అందరికి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ కారణంగా ఐపీఎల్ వాయిదా పడడం తో అప్పుడు సోషల్ మీడియాలో అభిమానులను అలరించాడు. కానీ ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ వాయిదా పడటంతో సెప్టెంబర్ 19 న ప్రారంభమైన ఐపీఎల్ లో పాండ్యా ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు రెండు మ్యాచ్ లు ఆడింది. అయితే ఈ రెండు మ్యాచ్ లలోను 14, 18 పరుగులు చేసి నిరాశ పరిచిన పాండ్యా అసలు ఒక బాల్ కూడా బౌలింగ్ చేయలేదు. దాంతో పాండ్యా ఎందుకు బౌలింగ్ చేయడం లేదు అనే ప్రశ్న అభిమానుల్లో మొదలయ్యింది. అయితే ఈ ప్రశ్నలకు ముంబై జట్టు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ జహీర్ ఖాన్ సమాధానం ఇచ్చాడు. జహీర్‌ మాట్లాడుతూ... హార్దిక్ గాయం కారణంగా దాదాపు ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం గాయం నుండి కోరుకున్న అతను పూర్తి ఫిట్ గా ఉన్నాడు. అలాగే పాండ్యా కుండా బౌలింగ్ చేయాలనీ అనుకుంటున్నాడు. కానీ గాయం నుండి ఇటీవల కోలుకున్న అతడి శరీరంపై అధిక భారం పడకూడదు అనే మేము అతనికి బౌలింగ్ ఇవ్వడం లేదు అని తెలిపాడు. అయితే గత ఏడాది సెప్టెంబర్ లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు పాండ్యా. ఆ గాయం నుండి కోలుకోవడానికి అతనికి ఏడాది సమయం పట్టింది. ఇక ఐపీఎల్ 2020 లో ఈ రోజు ముంబై బెంగుళూర్ తో మ్యాచ్ ఆడనుంది.