భరతనాట్యం బౌలర్ వీడియో షేర్‌ చేసిన యువీ...

భరతనాట్యం బౌలర్ వీడియో షేర్‌ చేసిన యువీ...

క్రికెట్‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ ఎంతో మంది ఫ‌న్నీ యాక్ష‌న్ ఉన్న బౌల‌ర్ల‌ను చూసి ఉంటారు. అందులో స్టార్ బౌలర్లు బుమ్రా, ల‌సిత్ మ‌లింగ‌, పాల్ ఆడ‌మ్స్‌లాంటి వారు కూడా ఉంటారు. కానీ భారత మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అందులో బౌలర్ యొక్క బౌలింగ్ యాక్ష‌న్‌ ను మాత్రం ఇంత‌కు ముందుప్పుడూ.. ఎక్కడ చూసి ఉండ‌రు. ఆయా వీధిలో బౌలర్ తన చుట్టూ తాను తిరుగుతూ వస్తు బౌలింగ్ చేస్తుంది. అయితే ఈ బౌలింగ్‌కు యువీ భ‌ర‌త‌నాట్యం బౌలింగ్ స్టైల్ అని పేరు పెట్టాడు. అలాగే ఈ స్టైల్‌పై నువ్వేమంటావ్ అంటూ ఆ విడి పోస్ట్ ను స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్‌సింగ్‌ను ట్యాగ్ కూడా చేశాడు.