పంజాబ్ జట్టు నుండి మళ్ళీ యువీకి పిలుపు... కానీ..?

పంజాబ్ జట్టు నుండి మళ్ళీ యువీకి పిలుపు... కానీ..?

భారత మాజీ ఆల్-రౌండర్ యువరాజ్ సింగ్ భారత్ సాధించిన రెండు ప్రపంచ కప్ లలో ముఖ్య పాత్ర పోషించాడు. 2000లో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన యువరాజ్ 2017 తర్వాత తనకు జట్టులో స్థానం దక్కకపోవడంతో గత ఏడాది ప్రపంచ కప్ సమయం లో జూన్ 10న రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే తాజా సమాచారం ప్రకారం యువీకి మళ్ళీ పంజాబ్ క్రికెట్ అసోషియేషన్ (పీసీఏ) నుంచి పిలుపు వచ్చింది అని తెలుస్తుంది. యువీ తాను ఇచ్చిన రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకొని  పంజాబ్ తరపున రంజీలో మళ్లీ ఆడాలని పీసీఏ కోరినట్లు తెలుస్తుంది. కానీ ఈ విషయం పై యువరాజ్ మాత్రం ఇంకా స్పందించలేదు అని సమాచారం. అయితే ఒకవేళ యువీ కూడా ఇందులోకి రావాలి అనుకుంటే మాత్రం అతనికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. అవేంటంటే... యువీ తన రిటైర్మెంట్ తర్వాత రెండు విదేశీ లీగులో ఆడాడు. కానీ మన భారత ఆటగాళ్లు ఐపీఎల్ తో సహా అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ లో ఆడాలంటే ఎవరు విదేశీ లీగులో ఆడకూడదు. చూడాలి మరి యువీ మళ్ళీ పంజాబ్ తరపున ఆడతాడా... లేదా అనేది.