సిక్సర్ల క్లబ్‌లోకి పోలార్డ్‌కు స్వాగతం పలికిన యువీ...

సిక్సర్ల క్లబ్‌లోకి పోలార్డ్‌కు స్వాగతం పలికిన యువీ...

విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ కీరన్‌ పొలార్డ్‌...ఆరు సిక్సర్ల కొట్టడంపై యువరాజ్‌సింగ్‌ స్పందించాడు. ఆరు సిక్సర్ల క్లబ్‌లోకి పోలార్డ్‌ను స్వాగతించారు. అద్భుతంగా ఆడావంటూ ట్వీట్‌ చేశాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన వీరులు ముగ్గురు మాత్రమే ఉన్నారు. దక్షిణాఫ్రికా ఆటగాడు హర్షలె గిబ్స్‌ అందరికన్నా ముందుగా ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో మ్యాచులో స్టువర్ట్‌ బ్రాడ్‌ విసిరిన ఓవర్లో ఆరుకు ఆరు సిక్సర్లు బాది తన పేరును మార్మోగించాడు. తాజాగా శ్రీలంక బౌలర్‌ ధనంజయ ఓవర్‌లో...పోలార్డ్ ఆరు సిక్సర్లు కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో అంతక ముందు ఓవర్ లోనే  ధనంజయ హ్యాట్రిక్ తీయడం విశేషం. ప్రస్తుతం ఈ రెండు ఘనతలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.