ఢిల్లీ ప్రజలు సహనం కోల్పోతున్నారు : యువరాజ్ సింగ్

ఢిల్లీ ప్రజలు సహనం కోల్పోతున్నారు : యువరాజ్ సింగ్

కరోనావైరస్ లాక్ డౌన్ సమయంలో భారతీయులు ఓపికగా ఉండాలని భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అభ్యర్థించారు, ఎందుకంటే దేశంలో సాధారణ స్థితికి రావడానికి ఇంకా కొంత సమయం పడుతుంది అని తెలిపారు. ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో యువరాజ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీ ప్రజలు సహనం కోల్పోతున్నారనే భావన నాకు వస్తోంది.  ప్రజలు సామాజిక దూరాన్ని పాటించడం ముఖ్యం. వారి రోగనిరోధక శక్తిని ఎలా మెరుగ్గా ఉంచుకోవాలో వారు తెలుసుకోవాలి అని అన్నారు. అలాగే "ఇది ఓటింగ్ లాంటిది. మీరు ఆలోచించలేరు, నేను నా కర్తవ్యం చేయకపోతే ఏమి జరుగుతుంది. ఇది కేవలం సహనానికి సంబంధించినది. ప్రతి ఒక్కరూ దీనిని విడిగా  చూడాల్సిన అవసరం ఉంది" అని యువరాజ్ అన్నారు. అయితే ఇప్పటివరకు మన దేశం లో కరోనా కారణంగా 160 మంది మరణించారు.