టీడీపీపై ఎస్‌ఈసీకి ఫిర్యాదుకు వైసీపీ రెడీ..!

టీడీపీపై ఎస్‌ఈసీకి ఫిర్యాదుకు వైసీపీ రెడీ..!

పంచాయతీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌లో పొలిటిక్‌ హీట్‌ పెంచుతున్నాయి... అధికార, ప్రతిపక్షాల మధ్య ఫిర్యాదుల పర్వం నడుస్తోంది... ఇప్పటికే ఏకగ్రీవాల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందగా.. ఇప్పుడు మేనిఫెస్టో విషయంలో ఎన్నికల కమిషన్‌ ఆఫీస్‌ మెట్లు ఎక్కేందుకు సిద్ధమవుతోంది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. పంచాయతీ ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేయగా.. టీడీపీ పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టోపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేయనుది వైసీపీ.. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయి.. పార్టీ గుర్తు ఉండని ఎన్నికలకు టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయటం రాజ్యాంగ విరుద్ధం అంటున్నారు వైసీపీ నేతలు. ఇదే అంశాన్ని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్తామని.. టీడీపీపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తామంటున్నారు వైసీపీ నేతలు. ఇక, రేపటి నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా... రాయలసీమ పర్యటనకు సిద్ధం అయ్యారు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌.. ఏకగ్రీవాలపై పలు ఫిర్యాదులు అందడంతో.. నిమ్మగడ్డ రాయలసీమ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.