ఎస్ఈసితో అఖిలపక్ష సమావేశానికి వైసీపీ దూరం...

ఎస్ఈసితో అఖిలపక్ష సమావేశానికి వైసీపీ దూరం...

మార్చిలో కరోనా లాక్ డౌన్ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే.  తిరిగి ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలు మొదలుపెట్టింది.  ఇందులో భాగంగా రేపు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది.  అన్ని పార్టీల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించింది.  అయితే, ఈ అఖిల పక్ష సమావేశానికి అధికార వైసీపీ దూరంగా ఉండాలని నిర్ణయించింది.  దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ ను ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విడుదల చేశారు.  సుప్రీంకోర్టు ఆదేశాలు చదివిన తరువాత మీటింగ్ పెట్టి ఉంటె బాగుండేదని అంబటి రాంబాబు పేర్కొన్నారు.  ఎస్ఈసీకి వేరే ఉద్దేశాలు ఉన్నాయని అన్నారు.  ఆగిపోయిన ప్రక్రియ తిరిగి ప్రారంభించాలంటే ప్రభుత్వ అభిప్రాయం తీసుకోవాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని అంబటి రాంబాబు పేర్కొన్నారు.