చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై వైసీపీ సెటైర్లు...

చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై వైసీపీ సెటైర్లు...
రాజకీయ ప్రయోజనాలు కాదు... రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు... నిన్న పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో వివిధ పార్టీలకు చెందిన నేతలతో ఆయన సమావేశమై... రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. అయితే చంద్రబాబు పర్యటనపై వైసీపీ ఎంపీలు సెటైర్లు వేస్తున్నారు. ఫోటో షూట్ కోసమే ఏపీ సీఎం పార్లమెంటుకు వచ్చారని వ్యాఖ్యానించారు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి... చిత్తశుద్ధితో తాము అవిశ్వాస తీర్మానం పెట్టామన్న వైసీపీ ఎంపీ... నాలుగేళ్లు ప్రభుత్వంలో ఉండి అవిశ్వాస తీర్మానం ఎలా పెడతారని... అన్నాడీఎంకే ఎంపీ తంబి దొర... టీడీపీ ఎంపీలను నిలదీశారన్నారు. రేపటికి కూడా అవిశ్వాస తీర్మానం కోసం నోటీసు ఇచ్చామన్నారు సుబ్బారెడ్డి. సీఎం చంద్రబాబు, ఢిల్లీలో నిరాధరణకు గురి కావడం బాధగా ఉందంటూ సెటైర్లు వేశారు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి... కనబడ్డవారిని చంద్రబాబు కలిశారని... చంద్రబాబును నమ్మే పరిస్థితి ఇప్పుడు రాజకీయాల్లో లేదన్నారు. చంద్రబాబు ఢిల్లీ వస్తే అవిశ్వాసం చర్చకు వస్తుందని అనుకున్నాం... అయినా ఆయన హస్తిన పర్యటనతో ఉపయోగం లేదన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమంకు కారణం జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే అన్నారు ఆ పార్టీ ఎంపీ వరప్రసాద్... రాష్ట్ర అభివృద్ధి కోసం లోక్‌సభ చిరవి రోజున రాజీనామాలు చేస్తామని... ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారాయన. రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు... నాలుగేళ్ల తర్వాత హోదా అంటున్నారని మండిపడ్డ వరప్రసాద్... చంద్రబాబు అసమర్థత వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదన్నారు. బాబు, ఢిల్లీ పర్యటనతో రాష్ట్రానికి ఉపయోగం లేదన్నారు ఎంపీ మిథున్ రెడ్డి... పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో టీలు తాగుతున్న ఎంపీలను, నేతలను చంద్రబాబు కలిశారని... ఆయనకు చిత్తశుద్ధి ఉంటే తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించాలన్నారు.