వైసీపీ నయా ప్లాన్... కేంద్రంపై ఒత్తిడి ... 

వైసీపీ నయా ప్లాన్... కేంద్రంపై ఒత్తిడి ... 

ఈ వర్షాకాల సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి పెండింగ్ లో ఉన్న అన్ని ప్రాజెక్టులను ఆమోదించుకునేలా చేసుకోవాలని వైసీపీ ప్లాన్ చేతున్నది.  పోలవరంతో సహా అన్ని పెండింగ్ లో ఉన్న అంశాలపై ఒత్తిడి తెచ్చేందుకు వైసీపీ సిద్ధం అవుతున్నది.  ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి వరుసగా వినతిపత్రాలు ఇవ్వాలని వైసీపీ ఎంపీలు నిర్ణయం తీసుకున్నారు.  పోలవరం విషయంలో సవరించిన అంచనాలను ఆమోదించాలని కేంద్రాన్ని కోరబోతున్నారు.  అదే విధంగా గ్రామ స్థాయిలో హెల్త్ సెంటర్ల భవనాల నిర్మాణాలకు నరేగాలో అవకాశం కల్పించాలని కేంద్రాన్ని ఎంపీలు కోరబోతున్నారు.  దిశా చట్టానికి ఆమోదం, గిరిజన కమిషన్ ఏర్పాటు వంటి వాటికి అనుమతి ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయబోతున్నారు.  అదే విధంగా గిరిజన విశ్వవిద్యాలయాన్ని సాలూరులో ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురాబోతున్నారు.  దీంతో పాటుగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల నిమిత్తం పెండింగ్ లో ఉన్న 14 వ ఆర్ధిక సంఘం గ్రాంట్ రూ.581.60 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేసేందుకు వైసీపీ ఎంపీలు సిద్ధం అవుతున్నారు.