రోజా సంచలన వ్యాఖ్యలు.. గ్రేటర్‌లో పవన్‌ అమ్ముడుపోయాడు..!

రోజా సంచలన వ్యాఖ్యలు.. గ్రేటర్‌లో పవన్‌ అమ్ముడుపోయాడు..!

జనసేన అధినేత వపన్ కల్యాణ్‌పై సంచలన ఆరోపణలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్యే ఆర్కే రోజా... గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్ అమ్ముడుపోయి... తిరుపతి సీటు కోసం ఢిల్లీలో కూర్చున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు వైసీపీ నేత. అసలు ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ ఉనికేలేదని వ్యాఖ్యానించిన ఆమె... ఎవ్వరు ఎన్ని కుట్రలు పన్నినా తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. ఓవైపు గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీకి జనసేన సంపూర్ణ మద్దతు తెలపడం.. ఆ వెంటనే ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో.. ఇలా ఘాటుగా స్పందించారు రోజా.. కాగా, గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన జనసేన.. అభ్యర్థుల జాబితా కూడా సిద్ధం చేసుకుంది.. ఇక, చివరి క్షణాల్లో బీజేపీ నేతలు ఆయనను కలిసి.. మద్దతు తెలపాల్సిందిగా కోరడంతో.. జనసేన పోటీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.. మరోవైపు.. తిరుపతి ఉప ఎన్నికలపై కూడా కసరత్తు జరుగుతోంది.. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ వెళ్లిన జనసేనాని.. ఆ సీటు తమకు కేటాయించాల్సిందిగా బీజేపీ అధిష్టానాన్ని కోరే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ఆ నియోజకవర్గంలో తమకు బలమైన ఓటింగ్ ఉందని లెక్కలు వేస్తోంది జనసేన పార్టీ.