చంద్రబాబు జైలుకు వెళ్లక తప్పదు: రోజా

చంద్రబాబు జైలుకు వెళ్లక తప్పదు: రోజా

చంద్రబాబు పాపం పండిందని మండిపడ్డారు వైకాపా ఎమ్మెల్యే రోజా. వ్యక్తిగత కేసు విచారణలో భాగంగా.. రోజా ఈరోజు ఉదయం గన్నవరం చేరుకున్నారు. ఈ సందర్భంగా రోజా మీడియాతో మాట్లాడుతూ...  ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబు నాయుడు సాక్షాలతో సహా అడ్డంగా దొరికిపోయాడని అన్నారు. అయినా కూడా ఆ సంభాషణలు తనవి కావంటూ చెప్పడం దారుణమని అన్నారు. భాజపా, వైకాపా, తెరాస పార్టీలు కుట్రపన్ని ఓటుకు నోటు కేసును మళ్లీ తెరపైకి తెచ్చారని టీడీపీ నేతలు అనడం సిగ్గుచేటన్నారు. ఎన్డీయేతో కలిసి ఉన్నప్పడే ఓటుకు నోటు కేసు బయటకు వచ్చిన విషయం ప్రజలందరికీ తెలుసని అన్నారు. ఇక్కడ అధికారం ఉన్నది చాలదని.. పక్క రాష్ట్రాలకు వెళ్లి ప్రభుత్వాలను కూలదోయాలని చూస్తే ఎవరు కూడా చూస్తూ ఉండరు అని హెచ్చరించారు. ఎన్డీయేతో కలిసి నాలుగేళ్లు ఉన్నారు కాబట్టి మీ తప్పులు విచారణకు రాకుండా స్లో అయ్యాయేమో కానీ.. ఈ రోజు మీ పాపం పండింది, చంద్రబాబు జైలుకెళ్లక తప్పదు అని అన్నారు.