నా కుటుంబ పోషణకే టీవీ షోలు-రోజా

నా కుటుంబ పోషణకే టీవీ షోలు-రోజా

ఓవైపు ఎమ్మెల్యేగా, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా సేవలు అందిస్తూనే మరోవైపు టీవీషోల్లో కనిపిస్తున్నారు ఆర్కే రోజా... పొలిటికల్ లైఫ్‌లో ప్రత్యర్థులపై పంచ్‌లు విసిరే ఆర్కే రోజా.. టీవీ షోల్లో.. అప్పుడప్పుడు డ్యాన్స్‌లతో ఆకట్టుకోవడంతో పాటు నవ్వులు పూయిస్తారు.. అయితే, ఓ వైపు పొలిటికల్‌ లైఫ్‌తో బిజీగా ఉంటూ.. టీవీ షోలు చేయడం వల్ల మీ ఇమేజ్‌కు ఇబ్బంది ఏమీలేదా? అంటూ ప్రత్యేక ఇంటర్వ్యూలో రోజాను ప్రశ్నించింది ఎన్టీవీ.. ఆ ప్రశ్నకు సమాధానంగా నాకంటూ ఓ కుటుంబం ఉంది.. నాపై ఆధారపడి ఉంది.. నా కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత నాపై ఉందన్నారు రోజా... కొందరికి కాలేజీలు, మరికొందరికి పెట్రోల్‌ బంకులు.. ఇంకా కొందరికి ఇతర వ్యాపారాలు ఉంటాయి.. నా వృత్తి ఇది.. దానిని తప్పుగా చూపడం సరైంది కాదన్నారు. కొందరు నన్ను టార్గెట్ చేసి విమర్శించినా.. ప్రజలు దీనిని హర్షించడంలేదన్నారు రోజా. 

ఇక, తనకు వెండితెర ఆఫర్లు కూడా వచ్చాయి, వస్తూనే ఉన్నాయన్నారు ఆర్కే రోజా... సినిమాలు అంటే హీరో, హీరోయిన్ల తేదీలను బట్టి చేయాల్సి ఉంటుంది.. రాజకీయ జీవితంలో ఎప్పుడు ఏ ఫోన్ వస్తుందో తెలియదు.. దీంతో సినిమాలు చేయడం కుదరడంలేదు.. టీవీ షోలు అయితే డేట్స్ మార్చుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. బాహుబలి, అరుంధతి లాంటి సినిమాలు వచ్చినప్పుడు.. మీరు కూడా ఇలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది అన్నవాల్లు ఉన్నారు.. కానీ, నాకు పొలిటికల్ లైఫే ముఖ్యం కదా అన్నారు.. ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇంకా ఆమె ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి...