బాబు మరోసారి తప్పుదోవ పట్టించారు...

బాబు మరోసారి తప్పుదోవ పట్టించారు...

అసెంబ్లీ చివరి రోజున సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మరోసారి తప్పుదోవ పట్టించేలా చేశారని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి... కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడంపై స్పదించిన ఆయన... నాలుగు సార్లు ప్రత్యేక హోదాపై తీర్మానాలు పెట్టారు... నాలుగున్నరేళ్లగా నిరుద్యోగులను నిరాశ పరుస్తూనే ఉన్నారని... బ్రహ్మండమైన ప్యాకేజన్న చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి పోరాడుదాం అంటూ యూ టర్న్ తీసుకుంటున్నారని మండిపడ్డారు. నాలుగోసారి ప్రత్యేక హోదా మీద తీర్మానం పెట్టి ప్రజలను‌మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన కోన రఘుపతి... తెలుగుదేశం పార్టీ రిమోట్ కంట్రోల్ నాలుగేళ్లుగా బీజేపీ కార్యాలయంలో ఉందని... రిమోట్ కంట్రోల్ వాళ్ల చేతులో ఉందిగనుకే ఓటుకు నోటు కేసుకు భయపడి పారిపోయారని సెటైర్లు వేశారు. ప్రతిపక్షంలో ఉన్న మాకు రిమోట్ కంట్రోల్ ఎందుకని ప్రశ్నించిన రఘుపతి... పసలేని ఆరోపణలు చేస్తూ చంద్రబాబు... కాంగ్రెస్ పార్టీతో అంటకాగుతున్నారని ఆరోపించారు.