ప్లాస్మా దానం చేసిన వైసీపీ ఎమ్మెల్యే.!

ప్లాస్మా దానం చేసిన వైసీపీ ఎమ్మెల్యే.!

దేశంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో మరణాల సంఖ్య అరికట్టడానికి వైద్యులు ప్లాస్మా థెరపీ ని వాడుతున్నారు. అయితే కరోనాను జయించిన వారు ప్లాస్మా ను దానం చేయడానికి భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు సైతం ముందుకు వచ్చి ప్లాస్మా ను దానం చేసి ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య ప్లాస్మాను దానం చేశారు. గుంటూరు రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటు చేసిన ప్లాస్మా డోనర్ సెల్ ను ఈరోజు జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.  కాగా ఆ ప్లాస్మా డోనర్ సెల్ లో ఎమ్మెల్యే ప్లాస్మాను దానం చేసారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే కిలారి మాట్లాడుతూ...ప్లాస్మాను దానం చేయడం సంతోషంగా ఉందన్నారు. కరోనా భయాందోళనకు గురుతున్నారని భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. కరోనా ను నియంత్రించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు.