ప.గో: వైస్సార్సీపీ నేతల ఘర్షణ

ప.గో: వైస్సార్సీపీ నేతల ఘర్షణ

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం కొత్తపల్లి గ్రామంలో ఇరువర్గాల మధ్య చెలరేగిన గొడవలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. దాడిలో గాయపడిన ఇద్దర్నీ మెరుగైన వైద్యం కోసం జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

బాదితులు తెలిపిన వివరాల ప్రకారం.. జి. కొత్తపల్లి గ్రామానికి చెందిన వైస్సార్సీపీ పార్టీ గ్రామ ప్రెసిడెంట్ అయినటువంటి గంజి ప్రసాద్ అనే అతను అక్రమంగా మైనింగ్ చేస్తున్నాడని ఇదే విషయంతో అతనిపై ఫిర్యాదు రావడంతో గోపాలపురం శాసనసభ్యులు ఆదేశాల మేరకు అదే పార్టికి చెందిన రెడ్డి సత్యనారాయణ అతను కార్యకర్తలు కలిసి అక్రమ మైనింగ్ చేస్తున్న ఒక జెసిబిని రెండు టిప్పర్ లను ద్వారకాతిరుమల పోలీసులకు అప్పగించమని సదర్ విషయంలో తమపై కక్ష పెంచుకొని తమ కార్యకర్తలకు చెందిన ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పై గంజి ప్రసాద్ అతని అనుచరులు కలిసి దాడి చేసి మమ్మల్ని తీవ్రంగా గాయపరిచారని బాదితులు తెలిపారు.   

దుర్గా ప్రసాద్ అనే అతను జి. కొత్తపల్లి గ్రామ వైస్సార్సీపీ ప్రెసిడెంట్ గా పని చేస్తున్నాడని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంపై గోపాలపురం శాసనసభ్యులకు అలాగే జిల్లా ఎస్పీకి కూడా అతనిపై ఫిర్యాదు చేయనున్నట్లు రెడ్డి సత్యనారాయణ తెలిపారు.