ఆ అవినీతిని కేసీఆర్‌ వెలికి తీయాలి

ఆ అవినీతిని కేసీఆర్‌ వెలికి తీయాలి

ఓటుకు నోటు ‌‌‌కేసు‌‌‌‌లో ఏపీ సీఎం చంద్రబాబు, ఆ పార్టీ ఎమ్మెల్యే పాత్రను అంతా చూశారన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ... పలుకుబడి ఉపయోగించుకుని చంద్రబాబు ఆనాడు బయటపడ్డారని ఆరోపించిన ఆయన... కేసు నుంచి బయటపడటానికే పదేళ్లు ఉమ్మడి రాజధానిలో ఉండే అవకాశాన్ని వదిలి వెళ్లిపోయారన్నారు. గోదావరి నీళ్ల విషయంలోనూ కేసు కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన బాబు... ఛార్జిషీట్‌లో పేరు రాకుండా కేసు నుంచి తప్పించుకోడానికి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. 

ఓటుకు నోటుతోపాటు నాటి భూ కేటాయింపులపైనా విచారణ చేపట్టాలని టీఆర్ఎస్ సర్కార్‌ను డిమాండ్ చేశారు బొత్స సత్యనారాయణ. కేసీఆర్‌కు నిజంగా చట్టం, రాజ్యాంగం మీద గౌరవం ఉంటే ఓటుకు నోటు కేసుపై కార్యాచరణ చేపట్టాలన్న బొత్స... మన్మోహన్, రాజీవ్ గాంధీయే కేసులు ఎదుర్కొన్నారని... చంద్రబాబు చట్టానికి అతీతమైనవాడు కాదన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన వైసీపీ నేత... స్టేలు తెచ్చుకుని నీతిమంతుడనని చెప్పుకుంటున్న చంద్రబాబు నిజస్వరూపం అందరికీ తెలుసన్నారు. కోర్టు కేసుల వల్లే ఐఎంజీ భూముల కేసు ఆగిందన్న బొత్స... చంద్రబాబుతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాలూచి పడలేదని స్పష్టం చేశారు.