ఏపీలో బిసిలకు వైఎస్ జగన్ దసరా కానుక... 

ఏపీలో బిసిలకు వైఎస్ జగన్ దసరా కానుక... 

ఏపీలో బిసిలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.  రాష్ట్రంలోని బిసిల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది.  దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం ఈరోజు జారీ చేసింది.  రాష్ట్రంలోని 139 వెనకబడిబన కులాల కోసం బీసీ సంక్షేమ శాఖ 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది.  ఈ కార్పొరేషన్లను మూడు కేటగిరీలుగా విభజించారు.  10 లక్షలకు పైగా జనాభా ఉన్న కార్పొరేషన్ ను ఏ కేటగిరిగా, 10 లక్షల వరకు జనాభా కలిగిన కార్పొరేషన్ ను బి కేటగిరిగా, లక్షలోపు జనాభా కలిగిన కార్పొరేషన్ ను సి కేటగిరిగా విభజించారు.  ఈ నెల 18 వ తేదీన కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, డైరెక్టర్ల నియామకం జరగబోతున్నది.