వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షుడితో జగన్ భేటీ..

వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షుడితో జగన్ భేటీ..

ఎన్నికల సంఘం వివరణ కోరడంతో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అందులో భాగంగా ఇవాళ లోటస్‌పాండ్‌లోని తన నివాసంలో శివకుమార్‌తో ఆయన భేటీ కానున్నారు. ఇటీవలే శివకుమార్ పై క్రమ శిక్షణ చర్యలు తీసుకున్నారు వైఎస్ జగన్.. అయితే, తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు శివకుమార్... దీంతో మార్చి 11వ తేదీలోగా  వివరణ ఇవ్వాలని వైసీపీని కోరింది కేంద్ర ఎన్నికల సంఘం... దీంతో మళ్లీ కలిసి పని చేయాలని శివకుమార్ కి పార్టీ సీనియర్ నేతల ద్వారా జగన్ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇవాళ భేటీలో ఎలాంటి చర్చ జరుగుతుంది. శివకుమార్ వెనక్కి తగ్గుతారా? అనే ఉత్కంఠ నెలకొంది.