గ్రేటర్‌ పోరు.. వైసీపీ కీలక ప్రకటన

గ్రేటర్‌ పోరు.. వైసీపీ కీలక ప్రకటన

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి... ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించగా... పేర్లు ప్రకటించకపోయినా.. జాబితాలో ఉన్నవారికే నామినేషన్‌ వేసుకోవాలని ఇప్పటికే సమాచారం అందించారు. ఈ తరుణంలో గ్రేటర్ ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.

గ్రేటర్‌ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేయడం లేదంటూ ఓ ప్రకటన విడుదల చేశారు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి... రాబోయే రోజుల్లో తెలంగాణలో వైసీపీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని.. ఈ విషయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అభిమానులు గమనించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు శ్రీకాంత్‌రెడ్డి.