తండ్రి హ‌త్య‌కేసులో జ‌గ‌న్ సోద‌రి సంచ‌ల‌న నిర్ణ‌యం...

తండ్రి హ‌త్య‌కేసులో జ‌గ‌న్ సోద‌రి సంచ‌ల‌న నిర్ణ‌యం...

వైఎస్ జ‌గ‌న్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి ఎన్నిక‌ల ముందు మృతి చెందిన సంగ‌తి తెలిసిందే.  వివేకానంద రెడ్డి మ‌ర‌ణంపై అనేక అనుమానాలు ఉన్నాయి.  ఇప్ప‌టికే ఈ కేసులో ద‌ర్యాప్తు జ‌రుగుతున్న‌ది.  అయితే, కేసులో పురోగ‌తి పెద్ద‌గా క‌నిపించ‌క‌పోవ‌డంతో వైఎస్ జ‌గ‌న్ సొద‌రి, వివేకానంద రెడ్డి కూతురు సునీతా రెడ్డి హుటాహుటిన డిల్లికి వెళ్లారు.  డిల్లిలో ప్ర‌ముఖ హ‌క్కుల కార్య‌క‌ర్త జోమున్ పుతెన్ ను క‌లిశారు.  త‌న తండ్రి మ‌ర‌ణం గురించిన అనేక కీల‌క విష‌యాల‌ను హ‌క్కుల కార్య‌క‌ర్త‌తో సునీతారెడ్డి పంచుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు చేయాల‌ని సునీతారెడ్డి కోరారు.  అందుకు జోమున్ అంగీకారం తెలిపారు.  వివేకానంద‌రెడ్డి హ‌త్య గురించిన కీల‌క ఆధారాలు త‌న‌వద్ద ఉన్నాయ‌ని, త్వ‌ర‌లోనే వాటిని బ‌య‌ట‌పెడ‌తాన‌ని ప్ర‌ముఖ హ‌క్కుల కార్య‌క‌ర్త జోమున్ పేర్కొన్నారు. వివేకాది ముమ్మాటికి హ‌త్యే అని, కొందరి ప్ర‌మేయంపై త‌న‌కు అనుమానాలు ఉన్నాయని, త్వ‌ర‌లోనే వాటిని బ‌య‌ట‌పెడ‌తాన‌ని జోమున్ తెలిపారు.  మ‌రి దీనిపై ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఎలా స్పందిస్తారో చూడాలి.