సొంత ఇళ్లలోనే మహిళకు గౌరవం లేదు-వైఎస్ షర్మిల

సొంత ఇళ్లలోనే మహిళకు గౌరవం లేదు-వైఎస్ షర్మిల

మహిళల్లోనే మార్పు రావాలి.. మార్పుకు నాంది స్త్రీ.. సొంత ఇళ్లలోనే మహిళకు గౌరవం లేదన్నారు వైఎస్ షర్మిల.. లోటస్ పాండ్ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆమె.. తెలంగాణలోని మొదటి విద్యుత్ లైన్ ఉమెన్ భారతిని.. ఈత, తాటి చెట్లు ఎక్కి కల్లు తీస్తు జీవనం సాగిస్తున్న సావిత్రిని, వనిత గ్యారేజ్ నడుపుతున్న ఖమ్మం అదిలాక్ష్మిని సన్మానించారు... ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. అవసరం అయినప్పుడు పోరాటం చేయాలి.. అవకాశాలు మనమే సృష్టించుకోవాలన్నారు.. అవసరం అయినప్పుడు నడుం బిగించాలి, మార్పు సాధించాలని పిలుపునిచ్చారు.. మహిళల త్యాగాలని గుర్తించాలని కాదు... కిరీటాలు పెట్టాలని కాదు.. కానీ, సొంత ఇళ్లలోనే మహిళకు గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. మహిళల్లోనే మార్పు రావాలి, మార్పుకు నాంది స్త్రీ అన్న ఆమె.. అసలు తెలంగాణ సమాజంలో మహిళల ప్రాతినిథ్యం ఎంత ? అని ప్రశ్నించారు.

తెలంగాణ రాజకీయ చైతన్యానికి అడ్డా అన్నారు వైఎస్ షర్మిల... రాణి రుద్రమదేవి నుంచి మొదలుకొని ఎంతో మంది మహిళలు ఎన్నో ఉద్యమాలు చేశారని గుర్తుచేసిన ఆమె.. ప్రత్యేక రాష్ట్రంలో మహిళలకు ఘోరంగా అన్యాయం జరిగిందన్నారు. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు మహిళలకు మంత్రులకు అవకాశం కల్పించారు.. కానీ, తెలంగాణలో మహిళకు మంత్రి పదవి దక్కడానికి ఐదేళ్లు పట్టిందని కామెంట్ చేశారు. చట్ట సభల నుంచి ఉద్యోగ అవకాశాల వరకు మహిళలకు నిర్దిష్ట కోటా ఉండాల్సిందేనని డిమాండ్ చేసిన షర్మిల... అందుకోసం నేను కొట్లాడతా... నేను సాధించే ప్రతి ఆశయంలో మహిళలకు పూర్తి ప్రాధాన్యం ఇస్తానని ప్రకటించారు.